సిరీస్ కోసం రూ.2000 కోట్లు.. మొత్తం స్మాష్

సిరీస్ కోసం రూ.2000 కోట్లు.. మొత్తం స్మాష్

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka chopra) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్(Citadel). ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సిరీస్. అమెజాన్ ప్రైమ్(Amazon prime) భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సిరీస్ కోసం.. అదే రేంజ్ లో ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్.

అయితే రిలీజ్ తరువాత ఈ సిరీస్ కు ఆశించిన ఫలితం రాలేదు. యాక్షన్ అడ్వెంచర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక తాజాగా ఈ సిరీస్ కోసం ఖర్చు చేసిన బడ్జెట్ వివరాలు చెప్పు అందరినీ అవాక్కయ్యేలా చేశారు అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ. ఈ సిరీస్ కోసం అమెజాన్ ఏకంగా  250 మిలియన్ డాలర్స్ వరకు ఖర్చు చేసిందట. మన దేశ కరెన్సీలో ఇది రూ. 2000 కోట్లకు సమానం. 

ALSO READ :హాఫ్ సెంచరీ కొట్టేసిన ధనుష్.. ఇక నుండి దర్శకుడిగా కూడా!

సిటాడెల్ పరాజయంతో రూ.2000 కోట్లు వృధా అయిపొయింది. ఈ న్యూస్ చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. కేవలం ఒక వెబ్ సిరీస్ కోసం రూ. 2000 కోట్లా. అవి డబ్బులా ఇంకా ఏమైనానా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదే సిరీస్ ను సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Smantha)తో రీమేక్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun dhavan) హీరోగా చేస్తున్నారు. 

హాలీవుడ్ లో సక్సెస్ కానీ ఈ సిరీస్.. ఇండియన్ వర్షన్ లో ఏ మేరకు మెప్పించనుందో చూడాలి మరి. ఒకవేళ సిటాడెల్ ఇండియన్ వర్షన్ గనక హిట్ అయితే.. అమెజాన్ కు కాస్త ఊరట లభిస్తుంది అని చెప్పొచ్చు.