సాగర్ జలాలపై కేఆర్ఎంబీ ఆర్డర్

సాగర్ జలాలపై కేఆర్ఎంబీ ఆర్డర్

ఏపీకి 4.20, తెలంగాణకు 8.50 టీఎంసీలు
హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్​ ప్రాజెక్టు నుంచి ఏపీ ఈ నెలాఖరు వరకు 4.20 టీఎంసీలు, తెలంగాణ సెప్టెంబర్​ నెలాఖరు వరకు 8.50 టీఎంసీల నీటిని వాడుకునేందుకు కృష్ణా రివర్​మేనేజ్​మెంట్​బోర్డు (కేఆర్​ఎంబీ) అనుమతి ఇచ్చింది. ఈ నెల 18, 19 తేదీల్లో వర్చువల్​గా నిర్వహించిన త్రిసభ్య ​కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నాగార్జున సాగర్ లో శుక్రవారం సాయంత్రానికి ఎండీడీఎల్​కు ఎగువన 12.73 టీఎంసీల నీళ్లు  నిల్వ ఉన్నాయి. తాగునీటి అవసరాల కోసం తమకు 5 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ, 10 టీఎంసీలు వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ కోరాయి. దీంతో సాగర్ లో కనీస నీటి మట్టానికి ఎగువన ఉన్న నీటిలో ఏపీ 4.20 టీఎంసీలు, తెలంగాణ 8.50 టీఎంసీలు వాడుకునేందుకు బోర్డు అనుమతి ఇచ్చింది.