తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలి: కేఎస్ రత్నం

తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలి: కేఎస్ రత్నం

చేవెళ్ల, వెలుగు:  రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ గెలిపించాలని ఆ పార్టీ చేవెళ్ల సెగ్మెంట్ అభ్యర్థి కేఎస్ రత్నం తెలిపారు. బుధవారం చేవెళ్ల, నవాబ్ పేట, దేవుని ఎర్రవల్లి, ఇబ్రహీంపల్లి గ్రామాల్లో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే చంద్రప్పతో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.  అనంతరం గొల్లగూడ గ్రామానికి చెందిన యువకులు, దేవుని ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్, పీఏసీఎస్ డైరెక్టర్ శ్యామలయ్య, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో  రత్నం సమక్షంలో బీజేపీలో చేరారు.