V6 News

డిసెంబర్ 16న కేఎస్హెచ్ ఐపీఓ

డిసెంబర్ 16న కేఎస్హెచ్ ఐపీఓ

ముంబై: మాగ్నెట్ వైండింగ్ వైర్ల తయారీ సంస్థ కేఎస్​హెచ్ ఇంటర్నేషనల్ ఐపీఓ ఈ నెల 16–18 తేదీల్లో ఉంటుంది. ప్రైస్​బ్యాండ్​ను రూ.365–384 మధ్య నిర్ణయించారు. కంపెనీ రూ.710 కోట్లు సమీకరించనుంది. షేర్లు ఎన్​ఎస్​ఈ, బీఎస్​ఈలో లిస్ట్ అవుతాయి. 

పూణేకు చెందిన ఈ కంపెనీ  ఐపీఓలో రూ.420 కోట్ల విలువైన ఫ్రెష్​ఇష్యూ, ప్రమోటర్ల ద్వారా రూ.290 కోట్ల విలువైన ఓఎఫ్​ఎస్ ఉంటుంది. కొత్త షేర్ల జారీ ద్వారా వచ్చే నిధులను అప్పుల చెల్లింపు కోసం, ఫెసిలిటీల విస్తరణ కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తారు.