- నిఘా వారోత్సవాల్లో కేటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ ప్రభాకర్ రావు
పాల్వంచ, వెలుగు : ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు అవినీతి, లంచగొండితనాలకు దూరంగా ఉండాలని కేటీపీఎస్ 5,6 దశల చీఫ్ ఇంజినీర్ మేక ప్రభాకర్ రావు అన్నారు. అవినీతి నిఘా అవగాహన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కర్మాగార ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక ఎంసీఆర్ హాల్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులందరూ నిజాయితీగా పనిచేసి దేశం, సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
ప్రతిఒక్కరూ లంచగొండితనానికి వ్యతిరేకంగా పోరాడినప్పు డే సమాజం బాగుంటుందన్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కర్మాగార ఎస్ఈలు శివరామిరెడ్డి, కృష్ణ , డీవై సీసీఏ రామారావు, విజిలెన్స్ డీఎస్పీ రమేశ్, సేఫ్టీ డీఈ సమ్మయ్య, ఏడీఈలు వెంకటేశ్వర్లు , నాగయ్య, సంక్షేమాధికారి భాగం రాధాకృష్ణ, ఎస్పీఎఫ్ సిబ్బంది, కార్మికులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
