సభ్యత్వం తీసుకున్న వారికి రేపటినుంచే ప్రమాద బీమా

సభ్యత్వం తీసుకున్న వారికి రేపటినుంచే ప్రమాద బీమా

జూన్ 27, 2019 నుంచి నేటి వరకు 50లక్షల మందికి పార్టీ సభ్యత్వం ఇచ్చినట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. సభ్యత్వం తీసుకున్నవారికందరికీ… రేపటినుంచి ప్రమాద బీమా అందేవిధంగా చూస్తామని చెప్పారు. ఇప్పటికే యునైటెడ్ ఇండియా కంపెనీకి 11కోట్ల, 21 లక్షల చెక్ ను అందజేసినట్లు తెలిపారు. 50లక్షల మందికి సభ్యత్వం ఇచ్చే కార్యక్రమంలో పాలుపంచుకున్న పార్టీ కార్యకర్తలకు థ్యాంక్స్ చెప్పారు కేటీఆర్.

గవర్నర్ నరసింహన్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు కేటీఆర్. ప్రస్తుతం తాము పార్టీ నిర్మాణం, కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే విషయం పై పనిచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సమస్యలు ఎత్తిచూపేందుకు ఏమీ లేవని అన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా వారికి సమాదానం చెబుతామని అన్నారు.