
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. మంగళవారం రాత్రి 728 డ్రోన్లు, 13 మిసైల్స్తో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసింది. దాదాపు మూడేండ్లుగా రెండు దేశాల మధ్య నడుస్తున్న యుద్ధంలో ఈ స్థాయిలో డ్రోన్లను, మిసైల్స్‌ను రష్యా ప్రయోగించడం ఇదే తొలిసారి. దాడుల వల్ల లూట్స్క్ నగరంతోపాటు ఉక్రెయిన్ నార్త్‌వెస్ట్‌లోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్స్కీ తెలిపారు.
లూట్స్క్ నగరం అనేది ఉక్రెయిన్ ఆర్మీకి వైమానిక స్థావరం. ఈ సిటీ భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. అయితే.. తాజా దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. డ్రోన్లను, మిసైల్స్‌ను ఎప్పటికప్పుడు కూల్చేశామని తెలిపారు. కొన్నిరోజులగా ఉక్రెయిన్ సైనిక స్థావరాలే టార్గెట్‌గా రష్యా దాడులకు తెగబడుతున్నది. జులై 4న కూడా ఇలాంటి దాడే చేసింది.