
కేంద్రం ఇస్తున్న స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఓవైపు రాష్ట్రం పనితీరు బాగుందని కేంద్రం అవార్డులు ఇస్తుంటే.. బీజేపోళ్లు విమర్శిస్తున్నారని తెలిపారు. రాజకీయాల కోసం మాట్లాడే వారికి సమాధానం ఇవ్వమన్నారు. అనవసర విషయాలు పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోవాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.
జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన 19 మున్సిపాలిటీలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ నిధులను ప్రత్యేకంగా పారిశుధ్యం కోసం వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు–2022 సాధించిన మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, కమిషనర్ల అభినందన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు.