చార్మినార్ దగ్గర కేటీఆర్,బీఆర్ఎస్ నేతల నిరసన

చార్మినార్ దగ్గర కేటీఆర్,బీఆర్ఎస్ నేతల నిరసన

ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోందని ఫైరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తున్నారన్నారు. లోగోలో చార్మినార్ ను తొలగించడమంటే హైదరాబాద్ ను అవమానించడమేనన్నారు. కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. చార్మినార్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు.

రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులపై చార్మినార్ దగ్గర కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా..  రాజకీయ కక్షతోనే  కాంగ్రెస్ ప్రభుత్వం  లోగోలో  మార్పు చేస్తోందని.. లోగో మార్పుపై  పెద్ద ఎత్తున  బీఆర్ఎస్ నిరసన  కార్యక్రమాలు  చేపడతామని తెలిపారు. కేసీఆర్ పెట్టిన గుర్తులను కావాలని  సీఎం రేవంత్ తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనలేదన్నారు.