మొదలైన పోలింగ్.. ఓటేసిన కేటీఆర్, కిషన్ రెడ్డి

మొదలైన పోలింగ్.. ఓటేసిన కేటీఆర్, కిషన్ రెడ్డి

గ్రేటర్ లో పోలింగ్ మొదలైంది.  ఓటర్లు పోలింగ్ సెంటర్ల వద్ద క్యూ కట్టారు. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ మొదలైన వెంటనే మంత్రి కేటీఆర్ బంజరాహిల్స్ లోని నందినగర్ లో పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. ఓల్డ్ సిటీ శాస్త్రీపురంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓటు వేశారు.

మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 9,101 పోలింగ్‌ సెంటర్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్​ ఏర్పాటు చేసింది. పోలింగ్‌ సెంటర్లకు అన్ని దిక్కులా 100 మీటర్ల మేరకు 144 సెక్షన్​ అమలులో ఉంటుంది. గ్రేటర్​లో 74 లక్షల 67 వేల 256 మంది ఓటర్లు ఉన్నారు. కరోనా పేషెంట్లకు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఓటేసేందుకు అనుమతి ఉంటుం ది. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది.