
హైదరాబాద్, వెలుగు: ‘‘కాంగ్రెస్ఎమ్మెల్యేలను లాక్కొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కాంగ్రెస్ప్రభుత్వం పడిపోతుంది. పడగొడుతున్నాం..” అంటూ సోషల్‌మీడియాలో ఫేక్ ప్రచారాలు చేయొద్దని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈ మేరకు ఆయన ట్వీట్‌చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ఓటమి తర్వాత ప్రజల నుంచి సానుభూతి వ్యక్తమవుతోందని, కేసీఆర్మళ్లీ సీఎం అయితే బాగుండు అనే భావన వారిలో ఉందని ఆయన తెలిపారు. కానీ, ప్రజల తీర్పును గౌరవిస్తామని, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని హుందాగా ప్రకటించామని.. ఇలాంటి పరిస్థితుల్లో తప్పుడుప్రచారం చేయడం తగదని, ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు కూడా హర్షించబోరని ఆయన తెలిపారు.
ప్రజల ఆమోదంతో రెండు సార్లు కేసీఆర్ప్రభుత్వం ఏర్పాటు చేశారని, భవిష్యత్‌లోనూ ప్రజల ఆమోదంతోనే బీఆర్ఎస్ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉన్నామో, ప్రతిపక్షంలో అంతకన్నా రెట్టింపు హుందాతనంతో ప్రజల పక్షాన కొట్లాడుదామని కేటీఆర్పార్టీ నేతలకు సూచించారు.