‘మల్లేశం’ సినిమాకు పన్ను రాయితీ ఇప్పిస్తా: కేటీఆర్

‘మల్లేశం’ సినిమాకు పన్ను రాయితీ ఇప్పిస్తా: కేటీఆర్

మల్లేశం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్. ఈ రోజు సినిమాను చూసిన ఆయన… మీడియాతో మాట్లాడుతూ… చిత్రాన్ని ఎంతో మానవీయంగా, హృద్యంగా తెరకెక్కించారని అన్నారు. ఒక సామాన్యుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు బాగుందని చెప్పారు. అంతరించిపోతున్న చేనేత కళకు పద్మశ్రీ మల్లేశం జీవం పోశారని అన్నారు. మల్లేశం కృషి వల్ల ఎంతో మంది తల్లులు ఉపశమనం పొందారని తెలిపారు.

మల్లేశం పాత్రలో ప్రియదర్శి బాగా నటించారని అన్నారు కేటీఆర్. ఈ చిత్రానికి మాటలు అంధించిన పెద్దింటి అశోక్ ఓ అజ్ఞాతసూర్యుడని కొనియాడారు. ప్రభుత్వం తరపున మల్లేశం సినిమాకు అన్నివిధాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. సినిమాటోగ్రఫి మంత్రితో మాట్లాడి వినోదపు పన్ను రాయితీ వచ్చేలా చూస్తానని మాటిచ్చారు కేటీఆర్. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసుందని చెప్పారు. చేనేత వస్త్రాలు ధరించడం ఈ సినిమా చూసాక మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేటీఆర్.