
రైతుబంధు సంబరాలు సంక్రాంతి వరకు జరుపుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో దాదాపు 50 వేల కోట్లు జమ అవుతున్ననేపథ్యంలో రైతుబంధు సంబరాలకు పిలుపునిచ్చింది టీఆర్ఎస్. జనవరి 3 నుంచి మొదలైన రైతుబందు సంబరాలు 10 వరకు ముగియాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో 10 వరకు కోవిడ్ నిబంధనల మేరకు ర్యాలీలకు ,ఊరేగింపులకు అనుమతి లేకపోవడంతో రైతుబంధు ఉత్సవాలను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ సంక్రాంతి వరకు రైతుబంధు సంబరాలు జరుపుకోవాలని సూచించారు. తప్పకుండా కోవిడ్ నిబంధనలను పాటించాలని పార్టీశ్రేణులను కోరారు.