
ఐటీఐఆర్ కు కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు ఐటీ మంత్రి కేటీఆర్. యూపీఏ-2 ప్రభుత్వం ఐటీఐఆర్ తీసుకొచ్చిందని తర్వాత వచ్చిన ప్రభుత్వాన్ని అడిగితే అదితమ పాలసీ కాదన్నారని అన్నారు కేటీఆర్. సభలో ఐటీ రంగంపై ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఐటీఐఆర్ కోసం 10 సార్లు కలిసినా లాభం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా ఐటీ రంగంలో తెలంగాణ 17 శాతం వృద్ధి సాధించిందన్నారు. హైదరాబాద్ నలుమూలలా ఐటీ కంపెనీలను విస్తరిస్తామన్నారు. త్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీఐఆర్ ను విస్తరింపచేయాల్సిన అవసరముందన్నారు కేటీఆర్. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు లక్ష 10 వేల కోట్లకు చేరాయన్నారు.