
తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం వేడెక్కింది.. రైతు సంక్షేమంపై చర్చకు రావాలంటూ పీఎం మోడీ, కేసీఆర్ లకు సీఎం రేవంత్ విసిరిన సవాల్ పొలిటికల్ హీట్ పెంచింది. సీఎం రేవంత్ సవాల్ స్వీకరించిన కేటీఆర్ చర్చకు తాను వస్తానంటూ బదులిచ్చారు. ఈమేరకు మంగళవారం ( జులై 8 ) సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి పార్టీ నేతలతో కలిసి వచ్చారు కేటీఆర్. ప్రెస్ క్లబ్ లో సీఎం కోసం కుర్చీ వేసి చర్చకు రావాలంటూ పిలుపునిచ్చారు కేటీఆర్. సీఎం రాకపోతే మంత్రులైనా రావాలని అన్నారు కేటీఆర్. సవాల్ విసిరి మాట తప్పడం రేవంత్ కి అలవాటేనని.. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మాట తప్పారని ఎద్దేవా చేశారు కేటీఆర్.
నోటికి వచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని.. ఆరు గ్యారెంటీలని చెప్పి బాండ్ పేపర్లు ఇచ్చారని అన్నారు. 18 నెలలుగా బూతులు తప్ప చేసిందేమి లేదని అన్నారు కేటీఆర్. రేవంత్ మాట తప్పుతారని తెలిసి సవాల్ స్వీకరించానని అన్నారు కేటీఆర్. 18 నెలలుగా ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. హామీలు నెరవేర్చకుండా పదేపదే రంకెలు వేస్తున్నారని అన్నారు. సీఎం రాకపోయినా మంత్రులైనా వస్తారని అనుకున్నామని.. రేవంత్ కు రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం రాదని తేలిపోయిందని అన్నారు కేటీఆర్.
ALSO READ :మిడతల దండును పంపిస్తే భయపడం.. మా జోలికొస్తే నాశనమైపోతవ్.. కేటీఆర్పై మంత్రి సీతక్క ఫైర్
నీళ్లు, నియామకాలు, నిధుల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని.. రేవంత్ పాలనలో నీళ్లు ఏపీకి తరలిపోతున్నాయని... నిధులు ఢిల్లీకి వెళ్ళిపోతున్నాయని అన్నారు. రేవంత్ యూరియా బస్తాల కోసం ఢిల్లీ వెళ్లారని అంటున్నారని.. ఢిల్లీ పెద్దల కోసం రేవంత్ ఏ బస్తాలు తీసుకెళ్తున్నారా అందరికీ తెలుసని అన్నారు కేటీఆర్.