జూబ్లీహిల్స్ , వెలుగు : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్గెలుపుతో కాంగ్రెస్కు ఇచ్చిన హామీలు మళ్లీ గుర్తుకు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిగూడ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో కరెంటు కష్టాలు మొదలయ్యాయని, ఇన్వర్టర్లు , జనరేటర్లు పెట్టుకునే పరిస్థితులకు రాష్ట్రం వచ్చిందన్నారు.
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇచ్చిందని, బీఆర్ఎస్ను గెలిపించి కాంగ్రెస్కు హామీలు గుర్తు చేయాలన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సునీతను గెలిపించుకోవాలన్నారు.
