కేసీఆర్ కు చాలా పనులుంటాయ్..అందుకే వరద బాధితుల్ని పరామర్శించలే

కేసీఆర్ కు చాలా పనులుంటాయ్..అందుకే వరద బాధితుల్ని పరామర్శించలే

కేసీఆర్ కు చాలా పనులుంటాయ్..అందుకే వరద బాధితుల్ని పరామర్శించలేదని అన్నారు మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన… ఎంఐఎంతో పొత్తుపెట్టుకొని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న వార్తలపై స్పందించారు. ఎంఐఎంకు మేయర్ సీటు ఇచ్చేందుకు మాకు పిచ్చి లేసిందా..మజ్లీస్ తో మాకు పొత్తు లేదు.. సింగిల్ గానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

వరద ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లలో పర్యటించినట్లు చెప్పిన కేటీఆర్.. డ్రైనేజీ 2 సెంటీమీటర్ల వాన మించి తట్టుకోలేదన్నారు. దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు ఇప్పటికే రూ.650 కోట్లు వరద సాయం అందించినట్లు చెప్పారు.  ఇంకా ఎవరైనా అర్హులు వుంటే వారికి కూడా ఇస్తాన్నారు.

కేసీఆర్ కు చాలా పనులుంటయి.. వరద చూడడానికి రాలేదు..  గోర్లు గిల్లుకుంటూ కూర్చున్న బండి సంజయ్,ఉత్తమ్ లు వరద ప్రాంతాల్లో పర్యటించారా అని అడిగారు. దుబ్బాక గెలుపుతో కొంత మందికి పైచాసికత్వం చూపిస్తున్నారు. 5ఏళ్లలో మేము చేసిన వంద పనులు చూపిస్తాం..కేంద్రం చేసిన ఒక్క పని బీజేపీ నేతలు చూపిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఎలక్షన్ లో ఏమి చేస్తారో చెప్పకుండా ఇండియా – పాకిస్థాన్, హిందూ – ముస్లిం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.