ఆరు గ్యారంటీలను రాష్ట్ర బడ్జెట్ గంగలో కలిపిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని, ఇది పూర్తిగా కోతల, ఎగవేతల బడ్జెట్ అని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘‘బడ్జెట్‌లో ఎన్నికల వాగ్ధానాలను గాలికి వదిలేసి ప్రజలను వంచించారు. ఇది డిక్లరేషన్‌లను బుట్టదాఖలు చేసిన దోకేబాజ్ బడ్జెట్. ఈ బడ్జెట్‌కు ఒక విధానంగానీ, విషయంగానీ, విజన్‌గానీ లేదు. కేవలం పథకాల పేర్ల మార్పులతో ఏమార్చారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది. అన్నదాతలకు సున్నం పెట్టారు’’అని ఫైర్ అయ్యారు.
