48 గంటలు టైం ఇస్తున్నా.. నిరూపించు లేదా క్షమాపణ చెప్పు: బండి సంజయ్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్

48 గంటలు టైం ఇస్తున్నా.. నిరూపించు లేదా క్షమాపణ చెప్పు: బండి సంజయ్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్

హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్కు కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆరోపణలు నిరూపించకపోతే లీగల్‌ నోటీసు పంపిస్తానని కేటీఆర్ హెచ్చరించారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలు హద్దు మీరాయని, బండి సంజయ్‌ 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే లీగల్‌ నోటీసు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ, బండి సంజయ్‌కు తెలివితేటలు ఎలా పనిచేస్తాయో అర్థం కాలేదని కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. అలాగే అతనికి కనీస జ్ఞానం కూడా లేదని, అతని నిర్లక్ష్యపు ప్రకటనలు హద్దు దాటాయని మండిపడ్డారు.

ఇంత చౌకబారు ఆరోపణలు చేయడం, థర్డ్ క్లాస్ ప్రకటనలు చేయడం అతనికి కూడా కొత్త కాదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలలో కొంతైనా నిజం ఉందో లేదో నిరూపించమని సవాల్ విసురుతున్నానని, బండి సంజయ్కు అధికారికంగా లీగల్ నోటీసు పంపిస్తున్నానని కేటీఆర్ తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు. రాబోయే 48 గంటల్లో తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు.