
హైదరాబాద్, వెలుగు: నీట్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతున్నదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ లో 67 మంది విద్యార్థులు 720 కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని తెలిపారు.