వర్షాకాలంలోపే మేడిగడ్డ రిపేర్ చేసి నీళ్లివ్వాలి: కేటీఆర్

వర్షాకాలంలోపే మేడిగడ్డ రిపేర్ చేసి నీళ్లివ్వాలి: కేటీఆర్

వర్షాకాలం రాకముందే మేడిగడ్డను రిపేర్ చేసి..పంట పొలాలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎర్రటి ఎండలో కూడా కేసీఆర్ రైతులకు నీళ్లు ఇచ్చారని చెప్పారు. కేసీఆర్  మీద ఉన్న కోపంతో రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సిరిసిల్లా జిల్లాలో BRS కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. గత కాంగ్రెస్ హయాంలో నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కేసీఆర్ రాక ముందు 3 లక్షలు ఉన్న ఎకరం పొలం..ఇప్పుడు 30 లక్షలు అయిందన్నారు. 

మోడీని బుట్టలో వేసుకోవడానికి కొన్ని మాటలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని కేటీఆర్ విమర్శించారు. నాలుగు నెలల క్రితం గుజరాత్ ను కించపరిచిన రేవంత్ నిన్న మోడీ ముందు దేశానికి గుజరాత్ మోడల్ అని అనడం విడ్డూరమన్నారు. వచ్చే రోజుల్లో రేవంత్ రెడ్డి,   మహారాష్ట్ర సీఎం ఎక్ నాథ్ షిండే లాగా మారి బీజీపీ తీర్థం పుచ్చుకోవడం గ్యారంటీ అని ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్..ఇందులో వంద భాగాలు ఉన్నాయని చెప్పారు.  మూడు బ్యారేజీలు, 270 పైగా సొరంగ మార్గాలు ఉన్నాయని వెల్లడించారు. రోజుకు 5 వేల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ALSO READ :- Andhra Pradesh: 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం: చంద్రబాబు నాయుడు

బీఆర్ఎస్ నుంచి వెళ్ళే వారు వెళ్లని.. కొత్త నాయకత్వాన్ని ఏర్పర్చుకుందామని కేటీఆర్ అన్నారు.  కరీంనగర్ లో  వినోద్ కుమార్ ఓడగొట్టికొని తప్పు చేసుకున్నాం .. మరోసారి అలాంటి తప్పు చేయద్దని  సూచించారు.  బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటుకు ఎం చేయలేదన్నారు.  మతం పేరుతో ఓట్లు అడగడం తప్ప కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఏం చేసింన్నారు.  అయోధ్య రామమందిర పేరు మీద రాజకీయం చేస్తూ బీజేపీ ఓట్లు దండుకునేందుకు  ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.