విందు విలీన వ్యూహం : పార్టీ మారిన MLAలకు KTR లంచ్

విందు విలీన వ్యూహం : పార్టీ మారిన MLAలకు KTR లంచ్

రాష్ట్రంలో సీఎల్పీ విలీన వ్యూహానికి అధికార పార్టీ మరింత పదును పెట్టింది. 2018 సార్వత్రిక ఎన్నికల్లో 19 స్థానాలు గెలిచింది కాంగ్రెస్. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయ్యారు.

MPగా గెలిచిన PCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉత్తమ్ తాజా రాజీనామాతో అసెంబ్లీలో విలీనానికి అవసరమైన సంఖ్య 12కి తగ్గింది. మరో ఎమ్మెల్యే పార్టీ మారితే అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది.

సీఎల్పీ విలీనానికి మరో ఎమ్మెల్యే అవసరమైన పరిస్థితుల్లో.. వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి కారెక్కాలని నిర్ణయించారు. ఇవాళ బేగంపేటలో సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి తన నిర్ణయం తెలియజేయనున్నారు. అంతకుముందే.. ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు. ఈ పరిణామంతో టీఆర్ఎస్ ఎల్పీ లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ విలీనం లాంఛనంగా మారింది.

పార్టీ మారిన ఎమ్మెల్యేలతో KTR లంచ్ మీట్

TRS లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సమావేశం అవుతున్నారు. వారికి లంచ్ ట్రీట్ ఇస్తున్నారు. ఈ విందు సమావేశంలోనే విలీన ప్రక్రియను పూర్తిచేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. విలీన ప్రక్రియే ప్రధాన అజెండాగా లంచ్ మీటింగ్ జరుగుతుందని సమాచారం.

ఎల్లుండి జెడ్పీ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఇది పూర్తికాగానే ఎమ్మెల్యేలంతా ప్రత్యేకంగా సమావేశమై విలీన లేఖపై సంతకాలు చేస్తారని సమాచారం. తర్వాత ఆ లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఇస్తే…. విలీన ప్రక్రియ పూర్తయినట్టే.