చెన్నూరులో సాండ్ బజార్ .. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలు .. త్వరలో ఏర్పాటు

చెన్నూరులో సాండ్ బజార్ .. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలు .. త్వరలో ఏర్పాటు

చెన్నూరు, వెలుగు: గోదావరి ఇసుకకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో చెన్నూరులో సాండ్ బజార్ ​ఏర్పాటు చేస్తున్నట్టు  మైనింగ్ ఏడీ జగన్​మోహన్​రెడ్డి,  డీజీఎండీసీ పీవో శ్రీధర్ తెలిపారు. బుధవారం చెన్నూరుప్రెస్ క్లబ్​లో వారు వివరాలు వెల్లడించారు. చెన్నూరుతో పాటు పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల అవసరాల కోసం ఆస్నాద్​రోడ్​లోని వంద పడకల హాస్పిటల్ సమీపంలో సాండ్ బజార్ కోసం స్థలాన్ని గుర్తించామన్నారు. వారం రోజుల్లో సాండ్ బజార్​ను ప్రారంభిస్తామని తెలిపారు. 

కోటపల్లి మండలం ఎర్రాయిపేట గోదావరిలోని టీజీఎండీసీ క్వారీ నుంచి ఇసుకను సాండ్ బజార్​కు తరలిస్తామని తెలిపారు. టన్ను ఇసుక రూ.500 లోపే లభిస్తుందని చెప్పారు. టీజీఎండీసీ పోర్టల్ ద్వారా ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సీసీ కెమెరాల నిఘా, టీజీఎండీసీ, మైనింగ్ సిబ్బంది పర్యవేక్షణలో సాండ్ సప్లై చేస్తామన్నారు. డిమాండ్​ను బట్టి త్వరలోనే మిగతా మండలాల్లో సాండ్ బజార్ల ఏర్పాటుకు మంత్రి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.