KTR ఔదార్యం : పేద విద్యార్థినులకు ఆర్థిక సాయం

KTR ఔదార్యం : పేద విద్యార్థినులకు ఆర్థిక సాయం

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. పేదరికాన్ని జయించి చదువుల్లో ఉత్తమ ప్రతిభ చూపించిన ఇద్దరు విద్యార్థినులకు ఆర్థిక సహాయం అందించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాలకు చెందిన రుద్ర రచన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కొల్పోయింది.

ఇటీవలే పాలిటెక్నిక్ పూర్తి చేసిన రచన ఈసెట్ లో మంచి ర్యాంకు సాధించి సీబీఐటీలో సీటు సంపాదించింది. ఐతే రచన ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న కేటీఆర్ ఆమెపై చదువులకయ్యే ఫీజులు, ఇతర ఖర్చులు భరిస్తానని చెప్పారు. వరంగల్ జిల్లా హసన్ పర్తికి చెందిన అంజలి ఐఐటీ ఇండోర్ లో సీటు సంపాందించింది. ఐతే తండ్రి ఆటో డ్రైవర్ కావడంతో తన ఆర్థిక పరిస్థితిని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కు తెలియజేసింది. అంజలిని తన నివాసానికి పిలిపించున్న కేటీఆర్ ఐఐటీ ఫీజులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు.