
హైదరాబాద్, వెలుగు: చదువుల్లో ప్రతిభ చూపి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు స్టూడెంట్స్‌కు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఆర్థిక సాయం అందించారు. వరంగల్ జిల్లా హసన్‌పర్తికి చెందిన మేకల అంజలి తండ్రి రమేష్ ఆటో డ్రైవర్. ఆయన పెద్ద కూతురు గతేడాది ఎంబీబీఎస్‌లో మంచి ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుతోంది. రమేష్ తనకున్న భూమిని అమ్మి కూతురును చదివిస్తున్నాడు. అతడి రెండో కూతురు అంజలికి ఇటీవలే ఐఐటీ ఇండోర్‌లో సీటొచ్చింది. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న కేటీఆర్ ఆమె స్టడీకి ఫీజులు చెల్లిస్తానని చెప్పారు.
అలాగే పేరెంట్స్‌లేని రచన అనే స్టూడెంట్ పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న కేటీఆర్ తన ఇంటికి పిలిపించుకుని ఆమె చదువులకు కావాల్సిన ఆర్థికసాయం చేస్తానని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాలకు చెందిన రుద్ర రచన తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడే చనిపోయారు. ఇటీవల రచన సీబీఐటీలో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ సీటు సాధించింది. రచనకు ఆర్థిక సాయం చేయాలని ఆమె అక్క బావ ఇటీవల జగిత్యాల కలెక్టర్ శరత్‌కు ఫోన్ చేసి కోరారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
Met with Rachana today and extended financial assistance towards her college expenses pic.twitter.com/kprzGnWzyb
— KTR (@KTRTRS) July 18, 2019