వరుసగా ఏడేళ్లు కరువు వచ్చినా తాగునీటి కొరత ఉండదు

వరుసగా ఏడేళ్లు కరువు వచ్చినా తాగునీటి కొరత ఉండదు

హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మహా నగరమన్నారు మంత్రి కేటీఆర్. నల్గొండ జిల్లా పెద్దవుర మండలం సుంకిషాల వద్ద సుంకిశాల ఇన్ టెక్ వెల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2072  వరకు తాగు నీటిఇబ్బందులు లేకుండా ముందు చూపుతో ప్లాన్ చేసామన్నారు.ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అని అన్నారు. భౌగోళికంగా హైదరాబాద్ కు చాలా అనుకూలతలు ఉన్నాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపులా, బయట ఉన్న  ప్రాంతాలకు కూడా తాగు నీటిని అందించేలా ప్లాన్ చేశామన్నారు. సిటీ ఎంత విస్తరించినా నీటి కొరత లేకుండా సుంకిశాల ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు.

రూ.1450 కోట్లతో ఈప్రాజెక్టును నిర్మిస్తున్నామన్నారు. వరుసగా ఏడేళ్లుగా కరువు వచ్చినా తాగు నీటికి తిప్పలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.  రాబోయే వేసవి కాలం వరకు ఈ ప్రాజెక్టు ను పూర్తి చేస్తామన్నారు. అదనంగా పదహరున్నటీఎంసీల నీటిని  లిఫ్ట్ చేయడానికి ఈ ఇన్ టెక్ వెల్ ను నిర్మిస్తున్నామన్నారు.  మోటార్లు పెట్టి నీటిని పంపింగ్ చేసేలా కూడా  సివిల్ వర్క్స్ జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, జిల్లాల ప్రజలకు  ఇది ఎంతో ఉపయోగకరమన్నారు.