ఫార్మాసిటీకి నిధులివ్వండి

ఫార్మాసిటీకి నిధులివ్వండి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫార్మాసిటీ సహా రాష్ట్రంలోని ఇండస్ట్రియల్‌‌‌‌ పార్కులకు నిధులివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ను  మంత్రి కేటీఆర్‌‌‌‌ కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన లేఖ రాశారు. కేంద్రం చెప్తున్న మేక్‌‌‌‌ ఇన్‌‌‌‌ ఇండియాలో భాగంగా తాము హైదరాబాద్‌‌‌‌ ఫార్మాసిటీ చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రూ. 64 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 5.6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని వివరించారు. ఈ పార్క్ మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌, నీళ్లు, కరెంట్‌‌‌‌ సరఫరా, రైల్వే కనెక్టివిటీ, జీరో లిక్విడ్‌‌‌‌ డిశ్చార్డ్‌‌‌‌ బేస్డ్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం రూ. 5,003 కోట్లు ఇప్పుడు పెట్టబోయే కేంద్ర బడ్జెట్‌‌‌‌లో కేటాయించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్‌‌‌‌– -వరంగల్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌–- నాగపూర్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ కారిడార్లకు గుర్తింపునిచ్చిందని తెలిపారు.  హైదరాబాద్‌‌‌‌ ఫార్మాసిటీ, నేషనల్‌‌‌‌ ఇండస్ట్రియల్​ మ్యానుఫ్యాక్చరింగ్‌‌‌‌ జోన్‌‌‌‌ -–జహీరాబాద్‌‌‌‌ నోడ్స్‌‌‌‌ అభివృద్ధికి ఆర్థిక సాయం అందించాలన్నారు. హైదరాబాద్‌‌‌‌–నాగపూర్‌‌‌‌ కారిడార్‌‌‌‌లో మంచిర్యాల​  నోడ్‌‌‌‌ను కొత్తగా గుర్తించాలని కోరారు. ఇండస్ట్రియల్​ కారిడార్​లలోని ఈ మూడు నోడ్స్‌‌‌‌కు రూ. 2 వేల కోట్ల చొప్పున రూ. 6 వేల కోట్లు బడ్జెట్‌‌‌‌లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌‌‌‌ –- బెంగళూరు, హైదరాబాద్‌‌‌‌ –- విజయవాడ కారిడార్లను నేషనల్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ కారిడార్లుగా అభివృద్ధి చేస్తామన్నారు. హుజూరాబాద్‌‌‌‌,  జడ్చర్ల –- గద్వాల–- కొత్తకోట నోడ్స్‌‌‌‌ను త్వరగా అభివృద్ధి చేసేందుకు ఒక్కోదానికి రూ.1,500 కోట్ల చొప్పున రూ. 3 వేల కోట్లు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో నేషనల్‌‌‌‌ డిజైన్‌‌‌‌ సెంటర్‌‌‌‌ ఏర్పాటు చేయాలని, దీని వ్యయంలో 25 శాతం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. డిఫెన్స్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌ కారిడార్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ను చేర్చాలని కేటీఆర్​ 
విజ్ఞప్తి చేశారు.