మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం

మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం

హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 2న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ చర్చించారు. ఎయిర్ పోర్టులో సిన్హాకు ఘనస్వాగతం పలకాలని నిర్ణయించారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి జలవిహార్ వరకు బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. ఆ తర్వాత జలవిహార్ లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్మన్ లను సైతం ఆహ్వానించనున్నారు. 

ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హా ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించారు. కేరళ నుంచి ఆయన తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఎంపీలు,ఎమ్మెల్యేలతో ఆయన విడివిడిగా సమావేశమై తనకు మద్ధతు ఇవ్వాలని కోరారు. ఇక రాష్ట్రంలోని 3 పార్టీల నేతలతో ఆయన విడివిడిగా భేటీ కానున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్​నేతలతో ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. ముందుగా సీఎం కేసీఆర్ తో ఆయన సమావేశం కానున్నారు. అదేవిధంగా టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు, మజ్లిస్ చీఫ్​ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలతో ​సిన్హా భేటీ కానున్నారు.