యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోడీ విఫలం

యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోడీ విఫలం

కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌ రాశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్న మోడీ..  ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కడ పోయాయని లేఖలో ప్రశ్నించారు.  తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షల 32 వేల  ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. మరో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది.  ప్రైవేటు రంగంలో 16 లక్షల ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించామని తెలిపారు.  కానీ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, ఉన్న ఉపాధి ఉద్యోగ అవకాశాలపై దెబ్బ కొడుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా శాశ్వతంగా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని,  దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రధానమంత్రి విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం యువతతో కలసి ఆందోళన చేస్తామని పేర్కొన్నారు.