
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ సహకారం తక్కువగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. మేక్ ఇన్ ఇండియా అంటున్న కేంద్రం..రాష్ట్రాలకు మాత్రం సహకరిండం లేదని తెలిపారు. ముంబైలో నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్ షిప్ ఫోరమ్ 28వ సదస్సుకు కేటీఆర్ హాజరయ్యారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చామన్నారు. ఐటీ పరిశ్రమలను జిల్లా కేంద్రాలకు విస్తరించినట్లు తెలిపారు. రైతుబంధుతో తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశంలోనే మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.