రేవంత్ పై కేటీఆర్ పరువు నష్టం దావా

V6 Velugu Posted on Sep 20, 2021

హైద‌రాబాద్ :  కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావాను దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి కొంత కాలంగా తనపైన అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రస్తుతం ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేకున్నా, రేవంత్ రెడ్డి దురుద్దేశ పూర్వకంగా తన పేరును వాడుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. కేటీఆర్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇలాంటి దుష్ప్రచారం వల్ల కలిగిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు.. క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని కూడా ప్రారంభించాలని కేటీఆర్ కోరారు.

గౌరవ న్యాయస్థానం తనపై రేవంత్ చేస్తున్న అసత్య ప్రచారాలను గుర్తించి, ఇలాంటి దురుద్దేశ కార్యక్రమాలకు పాల్పడుతున్న నిందితులను తగిన విధంగా శిక్షిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ ఇష్యూపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మంత్రి మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.

Tagged petition, court, KTR, Revanth reddy, drug,

Latest Videos

Subscribe Now

More News