
70కి పైగా సీట్లతో డిసెంబర్ 3న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ పై అసహనం వ్యక్తం చేశారు.
కేటీఆర్ కామెంట్స్:
- మళ్లీ అధికారం మాదే.. హ్యాట్రిక్ కొడుతాం.
- కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారు.
- 70కి పైగా స్థానాలు గెలుస్తాం.
- ఇంకా పోలింగ్ జరుగుతుంది.. రేపుఉదయం ఫైనల్ పోలింగ్ పర్సంటేజ్ వస్తుంది
- అప్పడే బీఆర్ఎస్ కు 10 శాతం పోలింగ్ తగ్గింది అంటే ఎట్లా
- 2018లో వచ్చిన ఎగ్జిగ్ పోల్స్ తప్పని తేలాయి.
- ఎగ్జిగ్ పోల్స్ ఓ రబ్బిష్.
- ఈ తరహా ఎగ్జిట్ పోల్స్ గతంలోనూ చూశాం. మాకు కొత్త కాదు.
- ఎగ్జిగ్ పోల్స్ చూసి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు.
- ఎగ్జిగ్ పోల్స్ తప్పయితే క్షమాపణలు చెప్తారా?
- 100కు వందశాతం రాష్ట్రంలో మళ్లీ మా ప్రభుత్వమే వస్తుంది.