మోడీ గత హామీల గురించి తెలుసుకోవాలని ప్రజలు భావిస్తుండ్రు

మోడీ గత హామీల గురించి తెలుసుకోవాలని ప్రజలు భావిస్తుండ్రు

ప్రధాని మోడీ పంద్రాగస్ట్ స్పీచ్ పై మంత్రి కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ..2047 కోసం కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. 25 ఏళ్లలో వాటిని చేరుకోవాలని చెప్పారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ..టార్గెట్స్ గొప్పగా ఉన్నాయని..అయితే 2022 అగస్ట్ 15 వరకు చేరుకోవాల్సిన లక్ష్యాలను ప్రధాని పట్టించుకోలేదని ఆరోపించారు. మోడీ గత హామీల గురించి తెలసుకోవాలని ప్రజలు భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. దానికి క్యా హువా తేరా వాదా అనే హ్యాష్ ట్యాగ్ను జోడించారు. 

2022 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు, రైతుల ఆదాయం రెట్టింపు, భారత ఆర్థికవ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చడం, ప్రతి ఇంటికి కరెంట్, వాటర్ వంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. మీ లక్ష్యాలను మీరు గుర్తించలేనప్పుడు జవాబుదారీతనం ఎక్కడుంది అని ప్రశ్నించారు.