
- రిలీజ్ చేసిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ చట్టాన్ని రాష్ట్ర సర్కార్ బ్రెయిలీ లిపిలో అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం బేగంపేట క్యాంపు ఆఫీస్‌లో ‘మున్సిపల్ యాక్ట్ - 2019’బ్రెయిలీ లిపి కాపీని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. బ్రెయిలీ లిపిలో మున్సిపల్ చట్టాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేసిన సీడీఎంఏ సత్యనారాయణను ఆయన అభినందించారు. చూపులేని వాళ్లు కూడా ఈ చట్టం గురించి తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం చేసినట్లు మంత్రి తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, నెలకు రూ.3,106 పింఛన్ ఇస్తున్నామని, ట్రై మోటార్ సైకిళ్లు, ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దివాకర్ రావు, మాగంటి గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగ స్టూడెంట్‌కు రూ.3 లక్షల సాయం
దివ్యాంగ స్టూడెంట్ అర్చనకు గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా మంత్రి కేటీఆర్ రూ.3 లక్షల సాయం అందించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన అర్చనకు పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంది. చదువులో ముందుండే ఆమెకు అవసరమైన హియరింగ్ మెషీన్ అందజేసేందుకు ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి ఫ్రెండ్ సిద్దిపేటకు చెందిన వంగ రాజేశ్వర్‌రెడ్డి రూ.3 లక్షల సాయం ప్రకటించారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆ చెక్కును అర్చనకు అందజేశారు.