- అలాంటి ప్రతిపాదనలు తిరస్కరించండి
హైదరాబాద్: కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలతో కలిసి ఈఆర్సీ చైర్మన్ రంగారావుకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వం వివిధ పేర్లు చెప్పి 18,500 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమైంది.
ఇప్పటికే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. పారిశ్రామిక రంగానికి సంబంధించి అన్ని కేటగిరీలకు ఒకటే రేటు, గృహ వినియోగదారులకు సైతం స్థిర చార్జీల పేరుతో విద్యుత్ భారం వేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది’ అని ఆరోపించారు.