ఆర్జీయూకేటీ విద్యార్థుల సమస్యపై స్పందించిన కేటీఆర్..

ఆర్జీయూకేటీ విద్యార్థుల సమస్యపై స్పందించిన కేటీఆర్..

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలోని సమస్యలపై మంగళవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో బాసర ఆర్జీయూకేటీ సమస్యలపై స్పందించాలని బంతిని తేజ గౌడ్ అనే విద్యార్థి మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.. కేటీఆర్ సార్ దయచేసి మా సమస్యలపై దృష్టి పెట్టండి.. 8 వేల విద్యార్థులు రోడ్డుపై నిలబడ్డం.. మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని ఆ విద్యార్థి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు మంత్రి స్పందిస్తూ.. ట్వీటర్ వేదికగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్దికి తాము కృషి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల లేవనెత్తిన అన్ని అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 

నిన్న నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో యాజమాన్య నిర్లక్ష్యంపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సుమారు 8 వేల మంది విద్యార్థులు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిపాలన భవనం ఎదుట బైఠాయించారు. రెండురోజుల కిందట విద్యాలయ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో ఆందోళనకు దిగామన్నారు.