తెలంగాణ భవన్ కాదు.. ఇక జనతా గ్యారేజ్..ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఇక్కడికి రావొచ్చు: కేటీఆర్

తెలంగాణ భవన్ కాదు.. ఇక జనతా గ్యారేజ్..ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఇక్కడికి రావొచ్చు: కేటీఆర్
  • పేదోళ్ల ఇండ్లు ఆదివారం ఎందుకు కూల్చివేస్తున్నరని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా తెలంగాణ భవన్ కు వచ్చి ఇక్కడున్న న్యాయవాదులకు చెప్పుకోవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇప్పటి నుంచి ఇది జనతా గ్యారేజ్ అని ప్రకటించారు. ఇక్కడ న్యాయవాదులు ఉంటారు. వాళ్లకు మీ సమస్యలు చెప్పి, సహాయం పొందొచ్చన్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో జరిగిన  జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ బూత్ లెవెల్ మీటింగ్ కు కేటీఆర్ అటెండ్ అయి మాట్లాడారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ “గాజుల రామారంలో పేదల ఇండ్లను రేవంత్ రెడ్డి ఆదివారం ఎందుకు కూల్చివేస్తున్నారు?  గతంలో హైకోర్టు సెలవు దినాల్లో కూల్చివేతలు వద్దని స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ, గాజులరామారంలో కోర్టు సెలవు రోజు చూసుకొని మరీ పేదల ఇండ్లను కూల్చివేశారు. ఇప్పుడు గాజుల రామారంలో జరిగింది.. రేపు జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లోని బోరబండ బస్తీకి కూడా రేవంత్ రెడ్డి హైడ్రా తో వస్తారు.

 కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఇండ్లు కూలగొట్టమని కాంగ్రెస్ బూల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లే” అని కేటీఆర్ అన్నారు. అందుకే జూబ్లీహిల్స్ బైపోల్, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఈ రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ఓటు వేయాలన్నారు. రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్​ఆర్) అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్ వల్ల నష్టపోతున్న రైతులకు అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన బాధితులు సోమవారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసి తమ సమస్యలను వివరించారు.