ఫ్రస్టేషన్‌లో ప్రభుత్వం.. వైఫల్యాలను ఎత్తి చూపినందుకే అక్రమ కేసులు : KTR

ఫ్రస్టేషన్‌లో ప్రభుత్వం.. వైఫల్యాలను ఎత్తి చూపినందుకే అక్రమ కేసులు : KTR

హైదరాబాద్‌ : ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌పై ఫ్రస్టేషన్, డెస్పరేషన్‌లో ఉన్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. 2 రోజులుగా జరుగుతుంది కేవలం ఆరంభమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులకు పిలుపునిచ్చారు. ‘త్వరలో మనపై కేసులు పెట్టడం, తప్పుడు ప్రచారం చేయడం చూస్తం. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా డిఫ్ ఫేక్ టెక్నాలజీతో ఫేక్​కంటెంట్​ని వారి పెయిడ్ ఆర్టిస్ట్‌లతో చేసే దుర్మార్గపూరిత కుట్రలు చూడాల్సి వస్తుంది. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ సోషల్ మీడియా ట్రోల్స్ మనల్ని టార్గెట్ చేస్తాయి. ఏం జరిగినా ఆశ్చర్యపోవద్దు. వాటిని మీ దృష్టి మరల్చనివ్వవద్దు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, అసమర్ధతను, హిపోక్రసీని ఎత్తిచూపుదాం’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.