మహిళా జర్నలిస్టులకు మెడికల్ క్యాంపులు : కేటీఆర్

మహిళా జర్నలిస్టులకు మెడికల్ క్యాంపులు : కేటీఆర్

ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే చీల్చిచెండాడండని మంత్రి కేటీఆర్ అన్నారు.  ఉమెన్స్ డే సందర్భంగా హైదరబాద్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులకు కేటీఆర్ అవార్డులు ప్రదానం చేశారు. మహిళా జర్నలిస్టులకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళా జర్నలిస్టుల కోసం  లీడర్ షిప్  యాక్సిలరేటర్ ప్రొగ్రామ్ ను ప్రారంభించబోతున్నామని తెలిపారు. మున్సిపల్ ఉద్యోగం థాంక్స్ లెస్ జాబ్ అని అన్నారు.

ప్రభుత్వం తప్పు చేస్తే చూపెట్టడంతో పాటు  మంచి కర్యాక్రమాలను కూడా ప్రజలకు తెలియజేయాలని కేటీఆర్ కోరారు.   మహిళా జర్నలిస్టులంతా కలిసి యూనియన్ గా ఏర్పడి  సమస్యలను ఐఅండ్ పీఆర్ కు తెలియజేయాలని సూచించారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అందరూ ప్రభుత్వాన్ని నిందిస్తారు కానీ.. రాత్రి రాత్రి అన్ని జరగవన్నారు.  కల్యాణ లక్ష్మి వల్ల బాల్య వివాహాలు తగ్గాయన్నారు. కేసీఆర్ కిట్ వల్ల సురక్షిత ప్రసవాలు పెరిగాయని..వీటిని  కూడా మీడియా చూపెట్టాలన్నారు. మహిళలపై దాడుల నివారణ పట్ల చైతన్యం ఉండాలన్నారు. జెండర్ సెన్సివిటి కరిక్యులమ్ లో ఉండాలని.. దానికి ప్రయత్నాలు జరగాలన్నారు. మహిళల్ని గౌరవించాలని చిన్నతనం నుంచి నేర్పించాలని చెప్పారు.