ఏడేళ్లుగా తెలంగాణలో వ్యాట్ పెంచలేదు

ఏడేళ్లుగా తెలంగాణలో వ్యాట్ పెంచలేదు

చమురు ధరల పెంపుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. చైనా హింస గురించి పుస్తకాల్లో చదివానని.. కానీ  14 రోజుల్లో 12 సార్లు ఇంధనం ధరల పెంచి కేంద్రం  అన్ని రకాల టార్చర్ లను తిరగరాసి కొత్త రికార్డ్ సృష్టిస్తుందన్నారు.  ఈ ధరల పెంపుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు కేటీఆర్. పార్లమెంటులో క్రూడ్ ఆయిల్ ధరల పెంపుపై ఎందుకు చర్చించట్లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను  ప్రశ్నించారు కేటీఆర్.

ధరలు తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి డిస్కర్షన్ చేయాలన్నారు. రాష్ట్రాలు రాష్ట్ర పన్నులను ఎలా తగ్గిస్తాయన్న వారిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యల చేశారు కేటీఆర్. ఏడు సంవత్సరాలుగా తెలంగాణలో వ్యాట్ ని పెంచలేదన్నారు. 30 శాతం పైగా ఫ్యూయల్ ధరలపై పన్ను విధిస్తున్న కేంద్రం...దాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు మంత్ర కేటీఆర్.