బీఆర్ఎస్ 9 నుంచి 12 ఎంపీ సీట్లు గెలుస్తుంది: కేటీఆర్

 బీఆర్ఎస్ 9 నుంచి 12 ఎంపీ సీట్లు గెలుస్తుంది: కేటీఆర్

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 నుంచి 12 ఎంపీ సీట్లు గెలుస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పై ప్రజల్లో అపుడే వ్యతిరేకత మొదలైందన్నారు.  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లై డిటెక్టర్, నార్కో టెస్ట్‌కైనా సిద్ధమన్నారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్‌ల ఫోన్‌లు ట్యాప్ చేయడం లేదని  సీఎం రేవంత్ చెప్పగలరా? ప్రతిపక్షాల ఫోన్‌లను కేంద్రం ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. కిషన్ రెడ్డి, రేవంత్‌లకు లై డిటెక్టర్ టెస్ట్‌ తీసుకునే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. అనుమానాలు ఉంటే విచారణ చేసుకోవచ్చన్నారు.

రాష్ట్ర రాజకీయాలు మరో దశాబ్దం పాటు కేసీఆర్ చుట్టే తిరుగుతాయని కేటీఆర్ అన్నారు. 20 ఏళ్లుగా  కేసీఆర్ చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు నడిచాయన్నారు. తమ  ప్రభుత్వంలో తెలంగాణను నంబర్ వన్ గా నిలబెట్టామన్నారు. అధికారంలో కొన్ని పొరపాట్లు చేశాం.. సరిదిద్దుకుంటామని చెప్పారు.  రైతుబంధు, దళితబంధు, కార్యకర్తల విషయంలో పొరపాట్లు గుర్తించలేకపోయామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే ఓడిపోయామన్నారు.