అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం కష్టం

అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం కష్టం

రాష్ట్ర జనాభాలో 2 శాతానికి మించి ప్రభుత్వఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ప్రపంచంలో, దేశంలో ఏ ప్రభుత్వమైనా గరిష్టంగా 5 శాతానికి మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలోని 4 కోట్ల జనాభాలో 7నుంచి 8 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చే అవకాశముందన్నారు. కానీ ప్రతి ఏడాది వేలాది మంది విద్యార్థులు చదువు కంప్లీట్ చేసుకుని వస్తున్నారని.. వారందరికి ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించడం కష్టమన్నారు. ప్రభుత్వ రంగంలో అందరికి ఉద్యోగాలివ్వడం కష్టం  కాబట్టే.. ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు కేటీఆర్.