జర్నలిస్టులు ఎంత పనిచేసినా గుర్తింపు తక్కువే

జర్నలిస్టులు ఎంత పనిచేసినా గుర్తింపు తక్కువే

 

  •     మాదీ అలాంటి వ్యవస్థే.. అందుకే వారి కష్టాలు తెలుసు
  •     పాజిటివిటీ పెంచే వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలె
  •     హైబిజ్ మీడియా అవార్డ్స్‌‌‌‌ ఫంక్షన్‌‌‌‌లో మంత్రి కేటీఆర్
  •     వీ6 యాంకర్​ చంద్రవ్వ, వెలుగు రిపోర్టర్‌‌‌‌‌‌‌‌ డేగ కుమార్, వీ6 రిపోర్టర్‌‌‌‌‌‌‌‌ లక్ష్మీలకు అవార్డులు


మాదాపూర్, వెలుగు: జర్నలిస్టులది థ్యాంక్‌‌‌‌లెస్ జాబ్ అని, ఎంత పనిచేసినా దక్కే గుర్తింపు తక్కువేనని మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. తమది కూడా అలాంటి వ్యవస్థేనని, అందుకే జర్నలిస్టుల కష్టాలు తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. సోషల్ మీడియా హద్దులు దాటుతున్న పరిస్థితుల్లో నిజాన్ని జనాలకు తెలియజెప్పేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరింత కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం మాదాపూర్‌‌‌‌‌‌‌‌లోని హెచ్‌‌‌‌ఐసీసీలో హైబిజ్ టీవీ నిర్వహించిన మీడియా అవార్డ్స్‌‌‌‌ ఫంక్షన్‌‌‌‌కు మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ చీఫ్ గెస్ట్‌‌‌‌గా హాజరయ్యారు. జర్నలిజం, రేడియో, అడ్వర్టైజింగ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను అందజేశారు. వీ6 న్యూస్​ చానెల్​ నుంచి బెస్ట్​ ఫీమేల్​ యాంకర్​గా తీన్మార్​ చంద్రవ్వ(సుజాత), రిపోర్టింగ్ విభాగంలో వెలుగు స్టేట్ బ్యూరో రిపోర్టర్‌‌‌‌‌‌‌‌ డేగ కుమార్, వీ6 రిపోర్టర్‌‌‌‌‌‌‌‌ లక్ష్మీ.. కేటీఆర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. అడ్వర్టైజ్​మెంట్​ విభాగంలో వెలుగు ఏజీఎం శ్రీనివాస్​ సామల, బెస్ట్​ ఇన్​స్టిట్యూషనల్ సేల్స్​ విభాగంలో వెలుగు నుంచి ప్రేమ్​కుమార్​ రెడ్డిలకు అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో జర్నలిస్టులు సమాజానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. అయితే, అన్ని అంశాలనూ టీఆర్పీలు, సర్క్యులేషన్‌‌‌‌ కోణంలో చూడొద్దన్నారు. తప్పొప్పులను చూపిస్తూనే పాజిటివిటీ పెంచే వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కరోనా సమయంలో హెల్త్ రిపోర్టింగ్ చేసిన పలువురిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో హైబిజ్​ ఎండీ ఎం.రాజ్​గోపాల్, సీఈవో సంధ్యారాణి, మీడియా ప్రతినిధులు 
పాల్గొన్నారు.

రాష్ట్రంలో వర్సిటీ పెట్టండి: అజీమ్ ప్రేమ్ జీని కోరిన కేటీఆర్  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్ఈడీ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీతో పాటు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీని మంత్రి కేటీఆర్ కోరారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలోని కేసీ తండాలో విప్రో ఏర్పాటు చేసిన కన్జ్యూమర్ కేర్ ఫ్యాక్టరీని ప్రేమ్ జీతో కలిసి కేటీఆర్, మంత్రి సబితా రెడ్డి ప్రారంభించారు. ప్రేమ్ జీ జీవితం అందరికీ ఆదర్శమని కేటీఆర్ కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వాన్ని ఆయన నుంచి నేర్చుకోవాలన్నారు. ప్రేమ్ జీ వినూత్నమైన వ్యాపారవేత్త అని.. కరోనా కష్టకాలంలో హెల్త్ కేర్ కోసం కోట్ల రూపాయలు అందజేశారని గుర్తుచేశారు. రూ.300 కోట్లతో విప్రో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో 900 మందికి ఉద్యోగాలు వస్తాయని.. ఇందులో 90 శాతం ఉద్యోగాలు కందుకూరు, మహేశ్వరంలో ఉండే స్థానికులకే ఇస్తామని, 15 శాతం ఉద్యోగాలు మహిళలకు ఇస్తామని చెప్పారు. కాగా, తెలంగాణలో నిరంతరం పెట్టుబడులు పెడతామని అజీమ్ ప్రేమ్ జీ చెప్పారు. మంత్రి కేటీఆర్ ‘‘వెరీవెరీ చార్మింగ్’’ అంటూ ప్రశంసించారు.