పార్టీ మారిన ఎమ్మెల్యేలు వణికిపోతున్నరు: కేటీఆర్

పార్టీ మారిన ఎమ్మెల్యేలు వణికిపోతున్నరు: కేటీఆర్

హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గడగడ వణుకుతున్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండాపూర్ లో ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పరామర్శించారు కేటీఆర్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో  కొట్టి చంపాలి..  ఉరి తీయాలని మాట్లాడారు.. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు  సీఎం  రేవంతే కండువా కప్పారని చెప్పారు.  ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి రేవంత్ కండువాలు కప్పారని విమర్శించారు.  కోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవి పోవడం గ్యారంటీ అని అన్నారు. 

 హైకోర్టు తీర్పు వచ్చి రోజే అరికెపూడి గాంధీకి పీఏసీ పదవి ఇచ్చారుని చెప్పారు కేటీఆర్. పార్టీ మారానన్న గాంధీ..ఇపుడు బీఆర్ఎస్ లో ఉన్నానంటున్నాడు.. ఇదేం పద్దతి అని మా ఎమ్మెల్యేలు అడిగారు.  కౌశిక్ రెడ్డి ఇంటి పై 50 మంది గూండాలు దాడి చేశారు.  ఇంట్లో ఉన్న వాళ్లకు ఏమైనా జరిగితే ఎవరిది బాద్యత. 9 నెలలుగా రాష్ట్రంలో హెడ్ లైన్ మేనేజ్ మెంట్ జరుగుతోంది.  రేవంత్ ఆయన తొత్తులు దారుణంగా  ప్రవర్తిస్తున్నారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.