అవార్డులు వస్తుంటే.. గర్వంగా ఉంది: కేటీఆర్

అవార్డులు వస్తుంటే.. గర్వంగా ఉంది: కేటీఆర్

పదవులు వస్తాయి.. పోతాయి.. అంతేకాని శాశ్వతం కాదు.. పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశామన్నదే ముఖ్యమన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు.  పదవిలో ఉన్నప్పుడు అన్ని విధాలా మంచిగా పనిచేశారు కాబట్టే.. ప్రజలు, కెసిఆర్ సీఎం కాలేదన్నది జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.  జనవరి 16వ తేదీ మంగళవారం రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సర్పంచ్ లకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

పదవిలో నుండి పోయేముందు కూడా గౌరవంగా పంపించాలని భావనతో ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశామనని కేటీఆర్ చెప్పారు. ఓ కవి రాసిన పాట, పల్లే కన్నీరు పెడుతుందోయ్ అనే పాట ప్రభుత్వాన్నే మార్చేసిందన్నారు. తెలంగాణలో లాగా ప్రతి పల్లెలో డంప్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలు, ట్యాంకర్ లు, ట్రాక్టర్లు, నర్సరీలు లాంటివి ఏ రాష్ట్రంలో ఉన్నాయో చూపించాలని చాలెంజ్ చేస్తున్నానని అన్నారు.

సర్పంచ్ లు చాలా కష్టపడి పని చేసి ఓడిఎఫ్ ప్లస్ రాష్ట్రంగా  మార్చినందుకు సలాం చేస్తున్నా..  2014 నుండి ఇప్పటి వరకు మన రాష్ట్రానికే 82 అవార్డులు వచ్చాయని తెలిపారు. దేశంలోనే 30 శాతం అవార్డులు మన రాష్ట్రానికే వచ్చాయని తెలపడానికి గర్వంగా ఉందన్నారు కేటీఆర్. ప్రధాన మంత్రి సంసద్ ఆవాస్ యోజన పథకంలో దేశంలోనే టాప్20 లో 19 గ్రామాలు మనవే కావడం గొప్ప విషయమని చెప్పారు. పెండింగ్ బిల్లుల సమస్య పై మీ తరుపున ప్రభుత్వంతో మాట్లాడడానికి, గొంతు విప్పడానికి తాను సిద్దంగా ఉన్నానని కేటీఆర్ తెలిపారు.