విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ .. లండన్ ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సులో కేటీఆర్

విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ .. లండన్ ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సులో కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విజయాన్ని కేవలం అంకెలతో మాత్రమే కాకుండా ఆత్మగౌరవానికి, పట్టుదలకు ప్రతిరూపంగా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం లండన్ ఆక్స్​ఫర్డ్ వర్సిటీలో ఆక్స్ ఫర్డ్ ఇండియా ఫోరం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. బట్టర్ ఫ్లై ఎఫెక్ట్​లాగా కేసీఆర్ ఎఫెక్ట్ ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం, అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, అతిపెద్ద 5 టెక్ దిగ్గజ కంపెనీల ఆఫీసులు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. భారతదేశ చరిత్రలోనే విజయవంతమైన స్టార్టప్​ స్టేట్​గా తెలంగాణ ఉందన్నారు. తెలంగాణ తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని  కేటీఆర్ పేర్కొన్నారు. 

గిరిజన మహిళలను కొట్టడం రాక్షసత్వానికి నిదర్శనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామంలో గిరిజన మహిళలపై అటవీ అధికారులు చేసిన అమానుషమైన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ఒక ప్రకటనలో  ఖండించారు. గిరిజన మహిళల చీరలను చింపి, నిర్దాక్షిణ్యంగా కొట్టడం క్రూరత్వమన్నారు.