ఎన్నికల హామీ మేరకు పింఛన్లు రెట్టింపు: కేటీఆర్

ఎన్నికల హామీ మేరకు పింఛన్లు రెట్టింపు: కేటీఆర్

ఎన్నికల హామీ మేరకు పింఛన్లు రెట్టింపు చేశామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీడీ కార్మికులకు కూడా ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. సిరిసిల్లలో పెంచిన ఆసరా పెన్షన్ల ప్రోసిడీంగ్స్  పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ లబ్ధిదారులకు  సంబంధిత పత్రాలు అందజేశారు. 17 శాతం వృద్ధి రేటుతో అభివృద్ధిలో తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ముందుందన్నారు. నిర్మాణం పూర్తైన డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు ఇస్తామన్నారు. ఆశావహులు ఎక్కువ ఉన్న చోట లాటరీ తీసి ఇళ్లను కేటాయిస్తామన్నారు కేటీఆర్……