ఈ విజయం మామూలు విషయం కాదు: కేటీఆర్

ఈ విజయం మామూలు విషయం కాదు: కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి భారీ విజయం అందించిన తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసిఆర్ నాయకత్వంపై ప్రజలు మళ్లీ విశ్వాసం ఉంచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.2014 నుంచి చేస్తూ వస్తున్న అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని అన్నారు.

మొత్తం 120 మున్సిపాలిటీల్లో 100 కంటే ఎక్కువ మునిసిపాలిటీలను తమ పార్టీ గెలుచుకోవడం మామూలు విషయం కాదని అన్నారు కేటీఆర్. 9 మున్సిపల్ కార్పొరేషన్లలో మొత్తం 9 లో గెలవడం గొప్ప విజయమని ట్విటర్ లో పేర్కొన్నారు.