సిట్ విచారణకు కేటీఆర్..జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర భారీ బందోబస్తు

సిట్ విచారణకు కేటీఆర్..జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర భారీ బందోబస్తు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ(జనవరి 23) జూబ్లీహిల్స్ లోని  ఆఫీసులో  సిట్ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఆయన వెంటన హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ పీఎస్ కు చేరుకున్నారు. జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‎కు  జనవరి 22  సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ నందినగర్‎లోని కేటీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. 2026, జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‎లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే  ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు.

ALSO READ : ఎన్నికేసులు పెట్టినా భయపడ.. వారిని ఎప్పటికీ వదలను

తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‎లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో జనవరి 20న  బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావును సిట్ విచారించిన విషయం తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు ఆయనపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. హరీష్​ రావును ఇంటరాగేట్ చేసిన రెండు రోజుల్లోనే  కేటీఆర్ ను విచారిస్తోంది సిట్.