కేసులు కొత్త కాదని బెదిరింపులకు భయపడబోమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎంక్వైరీలకు భయపడేటోళ్లు..బాధపడేవారు లేరన్నారు. అధికారంలో ఉన్నపుడు ప్రజల కోసమే పనిచేశామని..ఏనాడు తప్పుడు పనులు చేయలేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు కేటీఆర్.
అసమర్థుడి జీవనయాత్రలా రెండేళ్ల పాలన సాగిందని విమర్శించారు కేటీఆర్. రోజుకో స్కాం పేరుతో కాలం వెళ్లదీస్తున్నారని.. 8 ఏళ్లుగా తన వ్యక్తిత్వ హననం చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. వ్యక్తిత్వ హననంతో తన కుటుంబ సభ్యులను క్షోభకు గురి చేశారని తెలిపారు. డైలీ సీరియల్ రూపంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుందన్నారు. తనకు హీరోయిన్లతో సంబంధం ఉందని తప్పుడు వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ,అనైతిక పనులు ఎప్పుడు చేయలేదన్నారు. విచారణకు వెళ్లి తమ ప్రభుత్వం ఏం తప్పు చేసిందని అడుగుతానని అన్నారు. బొగ్గు స్కాం బయటపెట్టడంతోనే హరీశ్ కు తనకు నోటీసులిచ్చారని ఆరోపించారు. రేవంత్ కు తొత్తులుగా ఉన్న అధికారులను ఎప్పటికీ వదిలిపెట్టబోనన్నారు కేటీఆర్. తప్పు చేసి రేవంత్ కు దొరికి పోవడం అలవాటేనన్నారు.
ALSO READ : న్యూ ఇయర్ రోజు మందు తాగి దొరికిన 270 మందికి జైలు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ జూబ్లీహిల్స్ లోని ఆఫీసులో సిట్ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఇప్పటికే ఈ కేసులో హరీశ్ రావు విచారణకు హాజరయ్యారు.
